అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలను అందించామని ఎన్నో సమస్యలను పరిష్కరించామని గడపగడపకు కార్యక్రమములో రాజాము నియోజకవర్గ ఎమ్మెల్యే కంబాల జోగులు తెలిపారు. ఎమ్మార్ అగ్రహారం, ఎస్ అగ్రహారం గ్రామాల్లో సోమవారం నిర్వహించిన గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. సంక్షేమం దిశగా రాష్ట్ర పాలన సాగుతుందని నవరత్నాలు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 105 సంక్షేమ పథకాలను పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయాలకి అతీతంగా అందిస్తుందని తెలిపారు. అర్హులైన వారికి ఆన్లైన్లోనే గుర్తించి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి అని తెలిపారు. గ్రామాల్లో ఇంకా సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు గడపగడపకు చేపట్టిన గ్రామాల్లో ప్రత్యేక నిధులు కూడా ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వైసిపి కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa