బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెరుకుపల్లి ఎస్సై డి. వెంకట కొండారెడ్డి హెచ్చరించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ పాదచారులకు, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై కొండారెడ్డి హెచ్చరించారు. రహదారి వెంట మద్యం సేవించే వారిపై కేసులు నమోదు చేశామన్నారు.