భారతీయ మార్కెట్లోకి మరోకొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది. ఇ-స్ప్రింటో హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఎమెరీ’ పేరుతో అందుబాటులోకి వచ్చింది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 140 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. రూ.1,29,999 లతో మొదలయ్యే ఎక్స్-షోరూమ్ ధరకు పొందవచ్చు. రిమోట్ కంట్రోల్ లాక్, యాంటీ-థెఫ్ట్ అలారం, మొబైల్ ఛార్జింగ్ సాకెట్, ఫైండ్ మై వెహికల్తో సహా అనేక సెగ్మెంట్-ఆధారిత ఫీచర్లు ఉన్నాయి.