హార్లే డేవిడ్సన్, హీరో మోటోకార్ప్ సంయుక్త భాగస్వామ్యంలో భాగంగా మొదటి బైక్ భారత మార్కెట్లోకి రానుంది. ఈ మోడల్ పేరు ‘హార్లే డేవిడ్సన్ X440 రోడ్‌స్టర్’. జులై నెలలో ఈ బైక్ లాంచ్ అవుతున్నట్లు సమాచారం. బైక్ ధర రూ. 3 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండే అవకాశం ఉంది. అంచనాల ప్రకారం, ఇది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో పూర్తిగా డిజిటల్ LED సెటప్, రౌండ్ LED హెడ్‌ల్యాంప్‌ను కలిగి ఉంటుంది.