కౌతాళం మండల పరిధిలోని నదిచాగి సచివాలయ పరిధిలోని మేదనూరు గ్రామంలో గురువారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై ప్రదీప్ రెడ్డి గడప గడపకు వెళ్లి లబ్ధిదారులకు ప్రభుత్వం అందించిన పథకాలు అడిగి తెలుసుకుని ముందుకు సాగారు. గడప గడపకు సందర్శించిన యువ నేత ప్రదీప్ రెడ్డి లబ్ధిదారులు ప్రభుత్వం తమకు అందించిన పథకాలకు కృతజ్ఞతా భావంతో స్వచ్ఛందంగా పూలమాలలు వేసి సన్మానించారు. ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ మా కుటుంబం మీద మా ప్రభుత్వం మీద మీరు ఉంచిన నమ్మకానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని ఇప్పటికే మీకు అందించిన పథకాలతోపాటు మరింత మేలు చేసే విధంగా కృషి చేస్తామని లబ్దిదారులకు తెలిపారు. గ్రామంలో ఎలాంటి చిన్నపాటి సమస్యలున్నా వెంటనే సదరు అధికారులు సమస్యలను పరిష్కరించాలని అక్కడున్న వాలంటీర్లకు అధికారులకు నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ప్రహల్లాద స్వామి , రామన్నగౌడ , ఎంపీడీవో జగన్మోహన్ రెడ్డి , ఏఓ శేషాద్రి , ఆర్ ఐ రాజశేఖర్ , వివిధ శాఖల అధికారులు , వల్లూరు మరెగౌడ , ఈశప్ప గౌడ , సోమశేఖరెడ , బసప్పగౌడ , ఎంపీటీసీ లింగన్నగౌడ , ఉప సర్పంచ్ నాగేశ , రమేష్ కాంతయ్య హనుమంత వడ్డే రామ సమ్మద్ , వివిధ గ్రామాల నాయకులు, ఎంపిటిసిలు, సర్పంచులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.