ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్స్ తయారీ, విక్రయాల్లో టాప్ ప్లేయర్స్‌లో ఒకటిగా దూసుకుపోతున్న ఎథర్ ఎనర్జీ తాజాగా 450 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో కొత్త వేరియంట్ అయిన ఎథర్ 450Sని లాంచ్ చేసింది. ఈ వేరియంట్ ప్రారంభ ధర సబ్సిడీని మినహాయించి కేవలం రూ.129,999 మాత్రమే అని కంపెనీ స్పష్టంచేసింది. ఇది 450S 3 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఒక్కసారి చార్జ్ చేస్తే 115 కి.మీ రేంజ్, గంటకు 90 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణించగలదు.