ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో మృతులు సంఖ్య పెరుగుతూనే ఉంది. అక్కడ బాధితులను వెలికితీయడంలో రెస్క్యూ టీం శ్రమిస్తున్నాయి. విశాఖ నుంచి సీరియర్ అధికారులు, రెస్క్యూ టీం సభ్యులు ఒరిశా బయలుదేరి వెళ్లారు. షాలిమార్-చెన్నై కోరమండల్ ఎక్స్‌ప్రెస్, ఎం విశ్వేశ్వరయ్య-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం రాత్రి ఒరిశాలోని బహనాగ బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. రైల్వే శాఖ ఇప్పటి వరకూ అధికారికంగా 238 మంది మృతి చెందారని ప్రకటించింది. 1000 మందికి పైగా గాయపడ్డారని ప్రకటించింది. విశాఖ నుంచి వెళ్లి రెస్క్యూ టీం సభ్యులు అక్కడ మృతదేహాలను వెలికితీస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు. గాయపడిన వారిని గోపాల్‌పూర్, ఖంతపరా, బాలాసోర్, భద్రక్ మరియు సోరో ఆస్పత్రులకు తరలించారు.