జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఆదివారం నగరంలోని ఎనిమిది కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగింది. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, తిరిగి 2. 30 నుంచి 5. 30 గంటల వరకు రెండు పూటలా పరీక్ష నిర్వహించారు. విద్యార్థులను ఉదయం ఏడు గంటలకే కేంద్రాల్లోకి అనుమతించారు. నిబంధనల మేరకు ఎలకా్ట్రనిక్ వస్తువులు, వాచీలను అనుమతించలేదు. రెండు అంచెల్లో తనిఖీలు నిర్వహించారు. కాగా చినముషిడివాడలో రోడ్డుకు ఆనుకుని పరీక్ష కేంద్రాలు ఉండడంతో విద్యార్థులు, వారికి తోడుగా తల్లిదండ్రులు రావడంతో కొంతసేపు వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది.