అందంగా మారాలనుకునే పురుషులు రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు సార్లు ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. రసాయనాలు తక్కువగా ఉండే ఫేస్ వాష్ ను మాత్రమే వాడాలి. షేవింగ్ చేసుకున్న ప్రతిసారి అలొవెరా జెల్ ను చర్మానికి రాసుకోవాలి. అలాగే గుమ్మడి కాయను రోజువారి ఆహారంలో తీసుకోవడం వల్ల చర్మం యవ్వనంగా కనబడుతుంది. బీట్ రూట్ రోజూ తీసుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా ఉంటాయి. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండటమే మేలు.