అమ్మాయంటే అందంగా ఉండటమే కాదు.. సన్నని నడుము ఉండాలని కూడా చాలా మంది కోరుకుంటారు. అలా కావాలంటే ఆహార నియమావళితో పాటు కాస్త కష్టపడక తప్పదు. సన్నజాజి లాంటి నడుము రావాలంటే యోగాతో మంచి ఫలితాలుంటాయి. కుంభకాసనం, నౌకాసనం, ధనురాసనం, భుజంగాసనం, ఉష్ట్రాసనం, ఏకపాద అథోముఖ స్వనాసనం 12వారాల పాటు చేయాలి. వ్యాయామం క్రమ పద్ధతిలో చేయాలి. ఇందులో పొట్టపై ఒత్తిడి పెంచే వాటిని చేస్తే మార్పు కనిపిస్తుంది. స్కిప్పింగ్, సైక్లింగ్, పరుగు వంటివి చేయడంతో పొట్టపై ఉన్న అదనపు కొవ్వు కరుగుతుంది. దీంతో నాజూకైన నడుము మీ సొంతం అవుతుంది.