ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ పదిహేనేళ్ల బాలిక ప్రియడి కోసం తండ్రిని దారుణంగా హతమార్చింది. హత్రాస్ గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో పదవ తరగతి చదువుతున్న బాలిక 15 రోజుల క్రితం ప్రియుడితో పారిపోయి, రెండు రోజుల తర్వాత తిరిగి వచ్చింది. దీంతో తండ్రి ఆమెను చితకబాది, ఆ యువకుడ్ని కలవొద్దని బెదిరించాడు. తాజాగా, బాలిక ఇంట్లో ఇద్దరు తండ్రికి దొరికిపోయారు. దీంతో తండ్రిపై దాడి చేసి హతమార్చారు.