మారుతీ సుజుకీ ఇండియా వాణిజ్య హ్యాచ్బ్యాక్ మోడల్ 'టూర్ హెచ్1'ను విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధరను రూ.4.8 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా నిర్ణయించింది. ఆల్టో కే10 ఆధారంగా రూపొందించిన ఈ మోడల్ సీఎన్జీ వేరియంట్ ధర రూ. 5.7 లక్షలుగా ఉంది. వాణిజ్య విభాగం కోసం ఈ కారును తయారు చేశామని, పెట్రోల్ వెర్షన్ లీటర్కు 24.60 కి.మీ, ఎస్-సీఎన్జీ వేరియంట్ కేజీకి 34.46 కి.మీ మైలేజీ ఇస్తాయని కంపెనీ తెలిపింది.