రాపూరు మండలాధ్యక్షురాలిగా కుమ్మరగుంట ప్రసన్న ఎన్నికయ్యారు. ఎవరికివారుగా క్యాంపులో ఉన్న 12 మంది ఎమ్పీటీసీ సభ్యులు శుక్రవారం ఏకమై ఎమ్పీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. తాత్కాలిక ఎంపీపీగా ఉన్న రాపూరు బిట్ 3 ఎంపీటీసీ కుమ్మరగుంట ప్రసన్నను ఏకగ్రీవంగా ఎన్నుకుని మండలాధ్యక్ష కుర్చీలో కూర్చోబెట్టారు. ప్రిసైడింగ్ అధికారి తిరుపతయ్య ఎంపీపీతో ప్రమాణం చేయించి రికార్డుల్లో తొలి సంతకం చేయించి ఎన్నిక పత్రాన్ని అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa