ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడిన ఓ బాలిక తన తల్లి బ్యాంక్ అకౌంట్ నుంచి ఏకంగా రూ.52 లక్షలను పోగొట్టింది. ఈ ఉదంతం చైనాలో జరిగింది. 13 ఏళ్ల బాలిక ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసగా మారింది. రోజూ ఫోన్‌లో పే-టు-ప్లే గేమ్స్ ఆడుతూ తల్లి బ్యాంక్ అకౌంట్‌లోని 449,500 యూవాన్‌లు (భారత కరెన్సీలో 52.19 లక్షలు) కేవలం నాలుగు నెలల్లోనే పోగొట్టింది. అయితే తల్లి తన బ్యాంక్ అకౌంట్‌ను చెక్ చేయగా కేవలం 5 రూపాయలు మాత్రమే ఉన్నాయి.