విండోస్ 32 బిట్ OS వినియోగిస్తున్న వారికి గూగుల్ షాకిచ్చింది. వారికి ఆగస్టు నుండి గూగుల్ డ్రైవ్ సేవలు నిలిపివేయనున్నట్లు తెలిపింది. సైబర్ దాడులు, డేటా భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. విండోస్ 8, విండోస్ 8.1, విండోస్ సర్వర్ 2012 యూజర్లకు ఈ సేవలు అందుబాటులో ఉండవని, యూజర్లను తమ కంప్యూటర్లను విండోస్ 10(64 బిట్)కు అప్ గ్రేడ్ చేసుకోవాలని సూచించింది.