జుట్టు తెగిపోయి రాలిపోవడం, ఒకే చోట ఎక్కువగా జుట్టు రాలడం వంటి సమస్యలకు ఉసిరి చెక్ పెడుతుంది. ఉసిరి రసం తాగితే శరీరంలో విటమిన్ 'సి' లోపం తగ్గుతుంది. ఉసిరి రసం జుట్టును నల్లగా నిగనిగలాడేలా చేస్తుంది. జుట్టును బలంగా మారుస్తుంది. ఉసిరికాయ నుంచి రసాన్ని తీసి అందులో టీ స్పూన్ రసాన్ని షాంపూతో కలిపి తలకు రాసుకోవాలి. ఇలా వారానికి కనీసం రెండు సార్లు చేస్తే జుట్టు నల్లగా మారుతుంది. అలాగే బలంగా కూడా తయారవుతుంది.