ఫ్రిజ్‌లో చికెన్ నిల్వ చేస్తున్నారా? అయితే మీరు ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. చికెన్‌ని ఎన్నిరోజులపాటు ఫ్రిజ్‌లో ఉంచి ఆహారంగా తీసుకోవచ్చనే విషయంపై అవగాహన ఉండాలి. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నివేదిక ప్రకారం.. పచ్చి చికెన్‌ని రెండు రోజులకంటే ఎక్కువగా ఫ్రిజ్‌లో ఉంచకూడదని పేర్కొంది. ఉడికించిన చికెన్ 3, 4 రోజుల వరకు ఫ్రిజ్‌లో ఉంచుకోవచ్చు. ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడం వల్ల చికెన్‌లో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. చికెన్ రంగుమారి చెడిపోయిన వాసన వస్తుంది.