సామూహిక వివాహ వేడుకల్లో ఒకేసారి 2,143 జంటల పెళ్లిళ్లు చేసి ప్రపంచ రికార్డును బద్ధలు కొట్టారు. రాజస్థాన్లోని బరన్లో సామూహిక వివాహాలు జరిగాయి. ఒకే ప్రదేశంలో హిందువు, ముస్లిం వివాహాలు నిర్వహించారు. అలాగే నూతన వధూవరులకు పరుపు, వంట సామాగ్రిలు, గృహోపకరణాలతో కూడిన వస్తువులను బహుమతిగా ఇచ్చారు. 12 గంటలు, 24 గంటల్లో అత్యధిక వివాహాలు జరిపి రెండు ప్రపంచ గిన్నిస్ రికార్డులు నెలకొల్పారు.