హనీమూన్‌కు వెళ్లిన నూతన జంట ప్రమాదవశాత్తు సముద్రంలో పడి మృతిచెందారు. తమిళనాడులోని సెన్నీర్కుప్పానికి చెందిన వైద్యురాలు విభూషిణియాకు చెన్నైకి చెందిన వైద్యుడు లోకేశ్వరన్‌తో ఇటీవల వివాహమైంది. నూతన జంట హనీమూన్‌కు ఇండోనేసియాలోని బాలీ దీవికి వెళ్లారు. ఈనెల 9న అక్కడ సముద్రంలో బోటు షికారుకెళ్లగా, బోటు బోల్తా పడి ఇద్దరూ మృతిచెందారు. మృతదేహాలను చెన్నైకి తీసుకురావడానికి రాష్ట్రప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.