వంటింట్లో దొరకే బిర్యానీ ఆకులో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. మానసిక ఆరోగ్యానికి బిర్యానీ ఆకు ఎంతో మేలును చేకూర్చుతుంది. రాత్రి పడుకునే ముందు రెండు బిర్యానీ ఆకులను తీసుకుని వాటిని కాల్చండి. దీని పొగను పీల్చినట్లయితే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. శ్వాస సమస్య ఉంటే.. ఓ పాత్రలో నీటిని నింపి బిర్యానీ ఆకును మరిగించుకోవాలి. ఆ తర్వాత ఓ గుడ్డను అందులో ముంచి తడిగుడ్డను ఛాతీపై ఉంచాలి. దీంతో శ్వాస సమస్య కూడా దూరమవుతుంది. ఈ ఆకులను పొడిగా చేసుకుని తీసుకుంటే మధుమేహం, చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది.