బద్వేలు పట్టణంలోని సిద్ధవటం రోడ్డులో వెలసి ఉన్న శ్రీ మహాలక్ష్మీ గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి శ్రీవారు శేష వాహనంపై శ్రీకృష్ణ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంకారంలో ఊరేగింపులో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాయ, కర్పూరం సమర్పించి పూజలు నిర్వహించారు.