అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్జాయ్ అతి తీవ్ర తుపానుగా మారి తీరం వైపు దూసుకొస్తోంది. ఈ తుపాను ప్రభావం ఎక్కువగా గుజరాత్, మహారాష్ట్రలపై ఉండనుంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. తుపాను దృష్ట్యా పశ్చిమ రైల్వే 67 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పశ్చిమ రైల్వే విపత్తు నిర్వహణ గదులు, హెల్ప్ డెస్క్లు, సహాయ రైళ్లను సిద్ధంగా ఉంచడం వంటి పలు చర్యలు తీసుకుంటోంది.