గార మండలం వత్సవలస పంచాయతీ మొగదాలపాడు గ్రామంలో ఈ నెల 9న జరిగిన హత్యలో ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ ఎల్. సన్యాసినాయుడు సోమవారం తెలిపారు. గార పోలీసుస్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మొగదాలపాడు గ్రామానికి చెందిన చీకటి చిన్నయర్రయ్య కొమరవానిపేట నుంచి వస్తుండగా ఇద్దరు వ్యక్తులు మాటు వేసి హతమార్చారని వివరిం చారు. ప్రాథమిక విచారణలో చేతబడి చేస్తున్నాడనే అనుమానంతోనే చంపారని తెలిసిందన్నారు. ఈ కేసులో గ్రామానికి చెందిన చీకటి గురుమూర్తి, చీకటి యల్లాజీలను అదుపులోకి తీసుకున్నామని, మంగళవారం న్యాయస్థానంలో హాజరుపరుస్తామన్నారు. మూఢనమ్మకాలను నమ్మి ప్రాణాలు తీయడం చట్టపరంగా నేరమని సీఐ పేర్కొన్నారు. ఎస్. ఐ. ఎన్. కామేశ్వరరావు, పోలీసు సిబ్బంది ఉన్నారు.