వంగర మండలం కోండచాకరాపల్లి గ్రామ సచివాలయ పరిధిలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, జెడ్పీటీసీ ప్రతినిధి కరణం సుదర్శన్ రావు సోమవారం నిర్వహించారు. వంగర మండల పరిధిలోని వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగులు మాట్లాడుతూ, సంక్షేమ పథకాలు అందుకోవడం అన్నది ప్రజల హక్కు అని అభివర్ణించారు. ఇవాళ వ్యవస్థల్లో అవినీతి అన్నది తుడుచి పెట్టుకు పోయిందని, ఒకనాడు జన్మభూమి కమిటీలు చెబితేనే పథకాలు అందేవన్నారు. కానీ ఇప్పుడు అలా కాదు నేరుగానే మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పథకాలు అన్నవి అందిస్తున్నామన్నారు. పథకాలు అందుకునేందుకు మీలో ఎవ్వరూ లంచం ఇవ్వడం లేదు. కోరకుండానే అని మీకు అందిస్తున్నాము. ఇది కదా అసలైన మార్పు. ఈ మార్పును ప్రతి ఒక్కరూ గుర్తించాలి. మేలు చేసే ప్రభుత్వానికి అండగానిలిచి మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ప్రతీ ఒక్కరు సహకరించాలి అని విన్నవిస్తూ ఉన్నానన్నారు.