ఆరోగ్యం పేరుతో ప్రస్తుత కాలంలో చాలామంది గ్రీన్ టీకి అలవాటు పడ్డారు. గ్రీన్ టీతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మాట వాస్తవమే. కానీ గ్రీన్ టీ సారంతో కాలేయానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎక్కువ మోతాదులో ఎక్కువ కాలం ఆ సారాన్ని తీసుకొంటే లివర్ దెబ్బతినే అవకాశం ఉన్నదని అమెరికాలోని రుట్గర్స్ స్కూల్ ఆఫ్ హెల్త్ ప్రొఫెషన్స్ పరిశోధకులు వెల్లడించారు. గ్రీన్ టీ సారంతో క్యాన్సర్, హృద్రోగాలు, ఊబకాయం, మధుమేహం తగ్గుతుందని పలు అధ్యయానాల్లో తేలినా, తాము పరీక్షించిన కొంతమందిలో కాలేయం పాడైందని వివరించారు.