పైనాపిల్ ఉష్ణ మండల ప్రాంతాల్లో మాత్రమే దొరికే రుచికరమైన ఫ్రూట్. దీనిలో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఎంజైమ్స్ శరీరానికి ఎంతో మంచివి. పైనాపిల్ లో ఉండే విటమిన్ సీ ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థ కోసం సహాయపడుతుంది. పైనాపిల్‌లో బ్రోమెలైన్ ఎంజైమ్, డైటరీ ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇవి డయేరియా ప్రమాదాన్ని తగ్గిస్తాయి. జీర్ణక్రియ రేటును పెంచుతాయి.