టమాటలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఒక పెద్ద టమాటలో 33 కేలరీలు మాత్రమే ఉంటాయి. టమాటను ఆహారంలో భాగం చేసుకుంటే ఊబకాయాన్ని వదిలించుకోవచ్చు. టమాటలోని ఫైబర్ జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. కడుపులో చెత్తా చెదారం పేరుకుపోకుండా కాపాడుతుంది. పొట్టచుట్టూ ఉన్న చెడు కొవ్వును కరిగిస్తుంది. టమాటను సలాడ్ లా, జ్యూస్ గా తీసుకోవచ్చు. సూప్ లా వండుకోవచ్చు. టమాటను నిక్షేపంగా డైట్ లో భాగం చేసుకోవచ్చు.