కొన్ని రకాల పండ్లు, కూరగాయలు సహా వివిధ రకాల పదార్థాల్లో చక్కెరలు గ్లూకోజ్, మాల్టోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ రూపంలో నిలువ ఉంటాయి. అలాగే తేనెలో కూడా తీపిని ఇచ్చే పదార్థం ఉంటుంది. ఆ పదార్థాన్ని ట్రెహలోజ్ అంటారు. ఈ ట్రెహలోజ్ గుండె వ్యాధులను నివారించడానికి తోడ్పడుతుంది. ఈ విషయాన్ని తాజాగా ఒక అధ్యయనంలో పరిశోధకులు కనుగొన్నారు.