వాట్సాప్ విండోస్ యాప్‌లో సరికొత్త ఫీచర్లను లాంచ్ చేస్తూ యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరుస్తోంది. విండోస్ యాప్ యూజర్లు మిస్డ్ కాల్స్‌ను మరింత సులభంగా గుర్తించే స్పెసిఫికేషన్‌ను తాజాగా లాంచ్ చేసింది. ఇప్పుడు వాట్సాప్‌లో కాల్ వచ్చినప్పుడు, దానికి సమాధానం ఇవ్వనప్పుడు, ఈవెంట్ మెసేజ్‌లో "కాల్ బ్యాక్" బటన్ కనిపిస్తుంది. యూజర్లు తమను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తికి సులభంగా తిరిగి కాల్ చేయడానికి ఈబటన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. ఈఫీచర్‌ను యాక్సెస్ చేయడానికి, మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి విండోస్ వాట్సాప్ బీటా లేటెస్ట్ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.