వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది శీతల పానీయాలను ఆశ్రయిస్తారు. అయితే వీటిని ఎక్కువగా తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కూల్ డ్రింక్స్‌లో చక్కెర స్థాయి ఎక్కువ. అధిక బరువు పెరగడానికి, ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇందులో ఉండే ఫాస్పోరిక్ యాసిడ్ వల్ల శరీరంలో ఎముకలు బలహీనపడుతాయి. అలాగే దంతాలపై ఉండే ఎనామిల్ పొర దెబ్బతింటుంది. కూల్ డ్రింక్ వల్ల జీర్ణ సమస్య కూడా వచ్చే ప్రమాదం ఉంది.