దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీలు సహా కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ(జోసా) కౌన్సెలింగ్ నేటి నుండి ప్రారంభం కానుంది. నేటి నుండి జులై 26 వరకు 38 రోజులపాటు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. దేశంలోని 23 ఐఐటీలు, 32 ఎన్ఐటీలు, 26 ట్రిపుల్ఐటీలు, కేంద్ర నిధులతో నడిచే మరో 38 విద్యాసంస్థల్లో సీట్లను 'జోసా' కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు.