మెక్సికో తీరంలో భారీ భూకంపం సంభవించింది. సెంట్రల్ మెక్సిక్ ప్రాంతంలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదయిందని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. దాదాపు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ భూప్రకంపనల వల్ల సునామీ వచ్చే అవకాశం లేదని యూఎస్ సునామీ హెచ్చరిక వ్యవస్థ వెల్లడించింది.