దేశీయ మార్కెట్లో ‘కేటీఎం డ్యూక్ 200’ ని ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ కేటీఎం ఇండియా ఆవిష్కరించింది. ఇక ఫీచర్స్ కి వస్తే.. న్యూ 2023 కేటీఎం డ్యూక్ 200 బైక్‌లో ఫుల్ LED హెడ్ ల్యాంప్ సెటప్ ఉంది. బీమ్‌పై ఆరు రిఫ్లెక్టర్లతోపాటు 32 LED సెటప్‌తో కూడిన హెడ్‌ల్యాంప్ యూనిట్ ఉంటుంది. నూతనంగా రిలీజైన ఈ బైక్ బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ, సుజుకి గిజర్లతో పోటీ పడుతుంది.