క్యాబేజీలో కాన్సర్ నిరోదించే గుణాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. ముఖ్యంగా క్యాబేజీలో విటమిన్ ఎ, రిబోఫ్లేవిన్, ఫోలేట్, బి6లు, పీచుపదార్థాలు ఉంటాయి. అందువల్ల జీర్ణక్రియ మెరుగ్గా జరుగుతుంది. విటమిన్ సి కలిగి ఉన్న క్యాబేజీ తీసుకోవడం వలన గుండెజబ్బులు రాకుండా ఉంటాయి. పొటాషియం ఎక్కువగా ఉన్న క్యాబేజీని తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. అధికబరువు, కండరాల నొప్పులు తగ్గించి జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.