చాలా మందికి ఎలా చదువుకోవాలో అస్సలు తెలియదు. సమయం సందర్భం లేకుండా ఎప్పడు పడితే అప్పుడు చదివేస్తుంటాం. చదువుకునేందుకు మనసు మాత్రమే కాకుండా ముందుగా శరీరాన్ని సిద్ధంగా ఉంచాలి. అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి అల్పాహారం తీసుకోవాలి. ఆ తర్వాత గాలి ప్రశాంతంగా వీచే చోట అంటే చెట్టుకింద గాని, మరి ఏ ఇతర ఆసనం మీదగాని కూర్చొని చదువుకుంటే సబ్జెక్టు బాగా అర్ధం అవుతుంది.