మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి కొన్నేళ్ల క్రితం భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉపాధి కోసం సూరత్ వచ్చాడు. అక్కడ ఓ నిర్మాణ స్థలంలో తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న నాలుగేళ్ల బాలికను ఆ వ్యక్తి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్రగాయాలతో ఏడుస్తున్న చిన్నారిని తల్లిదండ్రులు చూసి ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు.