ఆదోని: వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం గరిష్ట వేరుశనగ ధర క్వింటా రూ. 7, 660 పలికింది. నిన్నటి కంటే ధర రూ. 380 పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా వేరుశనగ కనిష్ట ధర రూ. 4, 206, మధ్య ధర రూ. 6, 900 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. శనివారం మార్కెట్కు 9 (27 క్వింటాళ్లు) లాట్స్ వేరుశనగ వచ్చినట్లు అధికారులు తెలిపారు.