బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్‌లను బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోండి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులతోపాటు ప్రోటీన్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిని లిమిట్‌గా తీసుకోండి. అలాగే మొలకెత్తిన గింజలు, క్యారెట్, కీరా, దోస వంటివి బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవచ్చు. శరీర ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. మొలకెత్తిన గింజలను ఫ్రై చేసుకోవచ్చు. కావాలంటే ఇందులో చిటికెడు కారం, రుచికి సరిపడా ఉప్పు, మసాలా వేసుకోవచ్చు. అలాగే ఉడికించిన గుడ్లను బ్రేక్‌ఫాస్ట్‌గా తినాలి. హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల శరీర బరువు కూడా నియంత్రణలోకి వస్తుంది.