వరల్డ్‌కప్ 2023 షెడ్యూల్ విడుదలైంది. తాజాగా ఐసీసీ దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. పదేళ్ల తరువాత జరిగే ఈ ప్రపంచకప్ వన్టే టోర్నీకి భారత్ వేదిక కానుంది. టోర్నీ 2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో మొత్తం 10 టీమ్‌లు పాల్గొంటున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరుతుందని తెలుస్తోంది.
అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్‌లో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ప్రారంభం కానుంది. నవంబర్ 12న పూణేలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య జరిగే ఆఖరి గ్రూప్ మ్యాచులతో లీగ్ స్టేజ్ ముగుస్తుంది.. ముంబైలో నవంబర్ 15న మొదటి సెమీ ఫైనల్, కోల్‌కత్తాలో నవంబర్ 16న రెండో సెమీ ఫైనల్ జరుగుతాయి. నవంబర్ 19న అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్‌తో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ముగుస్తుంది. ఫైనల్ మ్యాచ్‌కి రిజర్వు డేగా నవంబర్ 20ని కేటాయించారు.