రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంగళవారం విజయవాడ లోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. పలువురి సమస్యలను అధికారులతో మాట్లాడి వెనువెంటనే ఆయన పరిష్కరించారు.
అనంతరం అన్నమయ్య జిల్లాకు చెందిన పలువురు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.