ఏపీలోని శాసనమండలిలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానంపై విపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నలు అడిగారు. దీనికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహార్ దీటుగానే బదులిచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని.. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే దాదాపు 40 లక్షల మంది బుకింగ్స్ చేసుకున్నారని.. 30 లక్షల మందికి అందజేశామని వివరించారు. మార్చి 31, 2025 వరకు మొదటి సిలిండర్ బుక్ చేసుకోవచ్చన్నారు. దీనికోసం పూర్తి నిధులు కేటాయించామని.. ఎవరికీ అనుమానాలు అవసరం లేదన్నారు.