వైసీపీ నాయకులు ఎస్సిలను మోసం చేశారని కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. ఎస్సిల అభివృద్ధి కోసం 2018లో సబ్సిడీల కింద రూ. 25 కోట్లను వెహికల్స్ కోసం మంజూరు చేశారు. 2019లో అవి వచ్చాయి. అయితే అప్పుడే ఎలక్షన్స్ రావడంతో ఇవ్వలేకపోయారు. కానీ వైసీపీ నాయకుల నిర్లక్ష్యంతో అవి దొంగలపాలయ్యాయి' అని అన్నారు.