బీజేపీ పాలనలో దేశం మొత్తం సేఫ్ గా ఉందని.. ఉగ్రదాడులను పూర్తిగా నిలువరించగలిగామని ప్రధాని మోడీ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలసిందే. తాజాగా ఈ కామెంట్లకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. మోడీ పాలనలో పారిశ్రామిక వేత్తలు మాత్రమే సేఫ్ గా ఉన్నారని.. పేద ప్రజలు కాదని ఎద్దేవా చేశారు.
ముంబయిలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్న ప్రధాని కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ‘ఏక్ హై తో సేఫ్ హై’ (ఐక్యంగా ఉంటేనే మనమంతా సురక్షితంగా ఉంటాం) అని ప్రజలకు పిలుపునిచ్చారు. దీనిపై రాహుల్ గాంధీ స్పందించారు.