నవంబర్ 22 నుంచి పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య 5-టెస్టుల సిరీస్‌లో మొదటి మ్యాచ్ జరగనుంది.పెర్త్‌లో జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు మ్యాచ్‌కు ముందే పిచ్‌కి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫొటోలు చూస్తుంటే బ్యాట్స్‌మెన్స్ పరిస్థితి తలచుకుంటే పాపం అనాల్సిందే. ఎందుకంటే, పిచ్‌పై చాలా గడ్డి ఉంది. దానిని పచ్చగా ఉంచడానికి నిరంతరం నీరు పోస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో, బంతి చాలా స్వింగ్, బౌన్స్ తీసుకోవచ్చని తెలుస్తోంది.నలుగురు ఫాస్ట్ బౌలర్లతో ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు బరిలోకి దిగవచ్చని కూడా భావిస్తున్నారు. యశస్వి జైస్వాల్, ఉస్మాన్ ఖవాజా, విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్ వంటి భారత బ్యాట్స్‌మెన్‌లకు ఈ పిచ్ కష్టతరమైనదిగా మారనుంది. అదే సమయంలో జస్ప్రీత్ బుమ్రా, పాట్ కమిన్స్ వంటి ఫాస్ట్ బౌలర్లు ఈ పిచ్‌ను ఇష్టపడవచ్చు. అయితే, పిచ్‌పై గడ్డి కోయాల్సి ఉందని అంటున్నారు. ఆ తర్వాతే పిచ్ ఎలా ఉంటుందో తెలియనుంది.
టీమిండియాకు సమస్యలు..
ఈ సిరీస్‌లో భారత్‌కు అనేక సవాళ్లు ఉన్నాయి. ముందుగా కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టు మ్యాచ్‌లో ఆడలేడు. తన రెండవ బిడ్డ పుట్టిన కారణంగా అతను భారతదేశంలోనే ఉన్నాడు. రెండో పెద్ద సమస్య ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు గాయం. తొలి టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యాడు. వీటన్నింటితో పాటు విరాట్ కోహ్లీ ఇటీవలి ఫామ్ కూడా ఆందోళన కలిగించే అంశం. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించేందుకు భారత్ తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో భారత జట్టు ప్రదర్శన ప్రత్యేకంగా ఏమీ లేదు. కాబట్టి ఈ సిరీస్‌ను గెలవాలంటే భారత్ అన్ని రంగాల్లోనూ మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది.
ఫాస్ట్ బౌలర్లు ఇక్కడ చాలా సహాయాన్ని పొందుతారని స్పష్టంగా తెలుస్తోంది. దీంతో బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇప్పటి వరకు ఈ మైదానంలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు మాత్రమే మ్యాచ్‌లో విజయం సాధించింది. ఇలాంటి మ్యాచ్‌లో ఏ జట్టు టాస్ గెలిచినా ముందుగా బ్యాటింగ్ చేయాలని కోరుకుంటుంది.