రాయచోటి గ్రామీణ పరిధిలో నూతన పోలీసు భవన నిర్మాణానికి కృషి చేయాలని రాష్ట్ర హోం మంత్రి అనితను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కోరారు. మంగళవారం సచివాలయంలో హోం మంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా డీఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేయడంతో పాటు పోలీస్ సిబ్బందికి క్వార్టర్స్ ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.