ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశవ్యాప్తంగా భారీ డిమాండ్..ప్రముఖ ఎస్‌యూవీ మోడల్ అర్బన్ క్రూయిజర్ హైరైడర్

business |  Suryaa Desk  | Published : Tue, Nov 19, 2024, 04:29 PM

ఇండియాలో ప్రముఖ కార్ల కంపెనీగా ఉన్నటువంటి టయోటా కిర్లోస్కర్ మోటార్ఇతర కంపెనీలకు గట్టి పోటీని ఇస్తూ, క్రమంగా తన అమ్మకాలను పెంచుకుంటుంది.ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఇన్నోవా క్రిస్టా, గ్లాంజా, రూమియన్, ఇన్నోవా హిక్రాస్, ఫార్చ్యూనర్ వంటి వాటితో పాటు ఇతర మోడళ్లను కంపెనీ విక్రయిస్తుంది. ఇవన్నీ కూడా ఇండియాలో మంచి డిమాండ్ ఉన్న కార్లుగా గుర్తింపు పొందాయి. వీటితో పాటు జనాధరణ పొందిన ప్రముఖ ఎస్‌యూవీ మోడల్ అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ను కూడా కంపెనీ విక్రయిస్తుంది. ప్రస్తుతం ఇది ఇండియాలో అత్యధికంగా డిమాండ్ ఉన్న SUV జాబితాలో ముందు వరుసలో ఉంటుంది. దీని ఆకట్టుకునే డిజైన్, పెర్ఫామెన్స్‌తో అందిరి మనసులు గెలుచుకుని ఎక్కువ అమ్మకాలను సాధిస్తుంది. టయోటా కిర్లోస్కర్ కంపెనీ అమ్మకాలు పెరగడానికి హైరైడర్ ఎంతో ఉపయోగపడుతుంది.కంపెనీ నుంచి తాజాగా విడుదలైన డేటా ప్రకారం, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ అమ్మకాల పరంగా సరికొత్త మైలు రాయికి చేరుకుంది. మొత్తం విక్రయాలు దాదాపు 1,00,000 చేరుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఇది 2022 సెప్టెంబర్ నెలలో విడుదల కాగా, అతి తక్కువ కాలంలోనే ఇన్ని అమ్మకాలను నమోదు చేయడం అంటే సాధారణ విషయం కాదు. ఈ గణంకాలు భారతీయ వినియోగదారుల్లో ఈ మోడల్‌కు ఉన్న ఆదరణను ప్రతిబింబిస్తున్నాయి.


ఈ రేంజ్‌లో విక్రయాలు సాధించడానికి ప్రధాన కారణం దాని డిజైన్‌తో పాటు మైలేజ్ కూడా ముఖ్యమైన అంశంగా నిలిచింది. ఇది 19.39 నుంచి 27.97 కిమీ వరకు మైలేజ్‌ను అందిస్తుంది. దీంతో చాలా మంది టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌నే ఎంచుకుంటున్నారు. ధర కూడా బడ్జెట్‌లోనే ఉంటుంది. ఇది రూ.11.14 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. పండుగ ఆఫర్లు, ఇతర తగ్గింపులతో ఈ ఎస్‌యూవీ మరింత తక్కువ ధరకు కొనుగోలుకు లభిస్తుంది.ఈ ఎస్‌యూవీలో ఐదు మంది వరకు హాయిగా కూర్చుని ప్రయాణించవచ్చు. మరో విషయం ఏమిటంటే ఈ కారులో లగేజీ పెట్టడానికి ఎక్కువ స్థలం ఉంటుంది. దూర ప్రాంతాలకు, టూర్లకు వెళ్లే వారికి ఈ హైరైడర్‌ బాగా సరిపోతుంది. ఇది 1.5-లీటర్ పెట్రోల్ నియో డ్రైవ్, (పెట్రోల్ + ఎలక్ట్రిక్)హైబ్రిడ్‌తో పాటు సీఎన్‌జీ ఆప్షన్‌లో కూడా అమ్మకానికి ఉంది. ఇంజిన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జోడించారు.


అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ E, S, G సహా అనేక వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. కారు క్యాబిన్‌లో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్, కనెక్ట్ కార్ టెక్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటివి ఉన్నాయి. అలాగే ప్రయాణికుల భద్రత పరంగా కూడా లోపల అధునాతన సదుపాయాలను అందించారు.టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ప్రయాణికుల రక్షణ కోసం 6-ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. అదనంగా EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆల్ వీల్ డిస్క్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్‌తో పాటు మరిన్ని ఉన్నాయి. ఇది హైబ్రిడ్ వేరియంట్‌లో కూడా లభించడంతో చాలా మంది వినియోగదారులు దీన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.


 


ఈ ఎస్‌యూవీకి డిమాండ్ అధికంగా ఉండటంతో కంపెనీ డెలివరీలు సైతం మరింత ఆలస్యం చేస్తుంది. ఇప్పటికే టయోటా తన ఉత్పత్తిని క్రమంగా పెంచింది. దీని వెయిటింగ్ పీరియడ్ గురించి చూసినట్లయితే దీపావళి పండుగకు అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ను బుక్ చేసుకున్న కస్టమర్లకు రెండు నెలల తర్వాత అంటే కొత్త ఏడాది నాటికి డెలివరీ చేస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com