కాలీఫ్లవర్ ఎక్కువగా తినడం వల్ల ఈ సమస్యలు తప్పవు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. శీతాకాలంలో ఎక్కువగా దొరికే కాలీఫ్లవర్‌ను అమితంగా తినడం చాలా హానికరం. థైరాయిడ్ సమస్యలతో బాధపడే వారికి ఇది చాలా హానికరం.
పిల్లలకు తల్లిపాలు ఇచ్చే తల్లులు దీనిని తినకూడదు. దీన్ని తినడం వల్ల బిడ్డకు కడుపునొప్పి వస్తుంది. దురద చర్మం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాపు వంటి అలెర్జీ ప్రతిచర్య లక్షణాలు ఉంటే వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది.