డార్క్ చాక్లెట్లను సరైన మోతాదులో తీసుకుంటే ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ చాక్లెట్లలో మాంగనీస్, కాపర్, జింక్, సెలీనియం, అయాన్, ఓలిక్ యాసిడ్స్ వంటి మినరల్స్ ఉంటాయి. ఈ చాక్లెట్లను తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు, డయాబెటిస్ నియంత్రణలో ఉంటాయి. మెదడుకు రక్తప్రసరణ అయ్యేలా చూస్తాయి. చెడు కొవ్వును తగ్గించి, మంచి కొవ్వును పెంచడంలో సహాయపడతాయి.