త్యాగనిరతతోపాటు మనోవాంఛ, స్వార్థం, అసూయ, రాగద్వేషాలను కూడా విడిచిపెట్టి మానవతను వెదజల్లాలన్నదే బక్రీద్ పండుగలో ఆంతర్యమని రాష్ట్ర జలవనరుల శాఖా మాత్యులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. గురువారం బక్రీద్ పర్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈద్గా వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. నమాజ్ అనంతరం ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేసి, ఏడాదంతా మీ కుటుంబాల్లో నూతన శోభ సంతరించాలని, అల్లా దయవల్ల సుభిక్షంగా రాష్ట్రం ఉండాలని ఆకాంక్షించారు. పట్టణానికి చెందిన వందల సంఖ్యలో ముస్లిం సోదరులు క్రమశిక్షణతో ప్రార్థనలు నిర్వహించారు. మంత్రి అంబటి తో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ నాగూర్ మీరాన్, వైయస్సార్సీపి రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, నియోజకవర్గ నాయకులు పక్కాల సూరిబాబు, పట్టణ కన్వీనర్ సహారా మౌలాలి, ముస్లిం సంఘ పెద్దలు, ప్రజాప్రతినిధులు , కౌన్సిలర్లు స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.