దువ్వూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాసులు గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇది వరకు ఆయన జిల్లాలో పలు స్టేషన్లలో పని చేశారు. ప్రస్తుతం పెద్దముడియం పోలీస్ స్టేషన్ నుంచి దువ్వూరు స్టేషన్ కు బదిలీపై వచ్చారు. దువ్వూరు పోలీస్ స్టేషన్ లో ఇదివరకు ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న రాఘవేంద్ర రెడ్డి అనంతపురం కు బదిలీ అయ్యారు.ఈ సందర్బంగా దువ్వూరు ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులు మాట్లాడుతూ. అధికారుల ఆదేశాల మేరకు, అందరి సహకారంతో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలియజేశారు. మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటానన్నారు. సాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవారి పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జూదం, మట్కా, ఎర్రచందనం, అక్రమ మద్యం రవాణా జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.